History

DSC_00271974 కి ముందు ఆ ప్రాంతమంతా పొలాలతో ,పొలం గట్లమీద పెద్ద పెద్ద పాముల పుట్టలతో నిండి ఉండేది. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సరైన దారి కూడా ఉండేదికాదు. రుద్రపాక శివారు పొలాలు అవ్వడం వలన రుద్రపాక నుండి సన్నటి దొంక రోడ్డు మాత్రం ఉండేది. అక్కడి పొలాల రైతులు,పనివారు మాత్రం పగలు వచ్చి పనులు చేసుకుని వెళ్ళేవారు . కొత్తవారు రావటానికి చాల భయపడేటట్లు ఉండేది ఆ ప్రాంతం. అటువంటి రోజుల్లో ఒకసారి సీతాకాలం సార్వాకోతలుకోసి, కుప్పలుపోసి అట్లూరి పిచ్చియ్య అనే రైతు 15 ఏండ్ల వయస్సున్న తన పెద్దకుమారుడ్ని, నౌకరును అక్కడ వదిలి చీకటి పడకముందే ధాన్యన్ని బండికి ఎకించుకుని రమ్మని కుమారుడిని పురమాయించి ఇంటికి వెళ్లిపోయారు చీకటి పడకముందే వచ్చేయమని కుమారుడికి చెప్పడానికి కారణం ,అంతకు రెండు,మూడు రోజులనుండి పొలం పనులు ఉండటం వలన వారికి చీకటి పడుతుండేది . అయితే చీకటి పదితేచాలు ఎక్కడి నుండి వచేదోగాని ఒక తెల్లటిపాము,చాల కాంతి వంతంగా మెరుస్తూ 10 గజాల బారు తో ఉండి ప్రాకుతూ వెళ్ళేది. మల్లి చీకటి పడితే ఆ పాము వస్తుందనే భయంతో పిచ్చియ్య కుమారున్ని పెందలాడే ఇంటికి రమ్మని చెప్పారు . ధాన్యాన్ని బళ్ళకు ఎక్కించడం ఆలస్యమై,చీకటి పడిపోయింది . ఆ రోజు కూడా తెల్లటి కాంతివంతమైన సర్పం వస్తూవుంది. కూలీలు రైతు నౌకరు కూడా భయపడి, నౌకరు కర్ర తీసుకుని ఆ తెల్లని పాము మీద వక దెబ్భవేసాడు. కానీ ధెభ సరిగా పడక పాము చుట్టలుగా చుట్టి ఉన్నగడ్డ్డిలోకి దురిపోయింది . నౌకరుకు భయం పట్టుకుంది ఆ రాత్రి ధాన్యానికి కావలిగా ఉండాలి తాను, దెబ్బతిన్న పాము కూలీలు, యజమాని కుమారుడు వెళ్ళిపోయాక తనను కాటు వేస్తుందని భయపడనారంబించాడు. అతని అనుమానం నిజమేనని, కూలీలు కూడా వంతపలికేసరికి భయం మరింత ఎక్కువైంది.

DSC_0196అందరూ కలిసి గడ్డిని తగులబెడితే అందులో ఉన్నపాము మంటలలో కాలి చనిపోతుందని సలహా ఇచ్చారు. వెంటనే గడ్డికి నిప్పంటించారు. గడ్డి ఒక మూల అంటుకోగానే తెల్లటిపాము బయటకు వచ్చి అందర్నీ ఒకసారి చూసి తలను నేలకు గెట్టిగా మూడు సార్లు కొట్టుకుని మరణించింది. అది చూసి కూలీలు,నౌకరు, యజమాని కుమారుడు నివ్వెరపోయారు. ఎంతో మంచిపాము అందువలనే వీరుచేసిన అవమానం భరించలేక మరణించింది అనుకున్నారంత. వెంటనే నౌకరు ఆ పామును మంటలలో వేసి దహనంచేసి ఆబూడిదను మూట కట్టి చెట్టుకు వ్రేలాడగట్టాడు. ఈ మొత్తం విషయాన్ని గమనిస్తున్న యజమాని కుమారుడికి ఆ తెల్లటి పామే గుర్తుకు వస్తుండగా, ధాన్యంతో ఉన్న బండిని తోలుకుంటూ, ఇంటిదారి పట్టారు. రుద్రపాక ఉనికిలి పోలిమేరలలోనికి బండి వచ్చేసరికి క్రింద సర్పం, పైన మనిషి ఆకారంతో ఉన్న ఒక వింతరూపం ఎదురుగ నిలిచి ఉంది. దానిని చుసిన బాలుడు భయంతో వణకసాగాడు. అపుడు ఆ వింతరూపoలో ఉన్న ఆకారము బాలుని సంబోదించి, నాయనా భయపడకు నేటితో నాకు శాపవిమోచనం అయింది. నేను తలను నేలకు కొట్టినచోట మీ నాన్నగారు చెరువు తవ్విదామనుకుoటున్నారు. ఆ చెరువుతో పాటు నాకు గుడి కట్టించండి, నేను ఇక్కడనే ఉంటాను. భక్తుల కష్టాలు తీర్చుతాను, మీకు శుభమవతుంది అని చెప్పి ఆ వింత ఆకారం అదృశ్యమయింది. ఇంటికి వచ్చి ఈ విషయమంతా తండ్రికిచెప్పారు. నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. పిచ్చియ్యకు రొజూ కలలో కనిపించటం, తనకు గుడి కట్టించమని అడగటం జరుగుతుండేది. నేను నీకు గుడి కట్టించలేను, నిష్టగా పూజలు చెయ్యలేను అని పిచ్చియ్య చెబుతుండేవారు. నీవు గుడి నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టి నిమిత్తమాత్రంగా ఉండు అంతా నేను చేసుకుంటానని స్వప్నంలో చెబుతుండేవారు స్వామి. చివరికి పిచ్చియ్య1978 డిసెంబరు 23న దేవాలయ శంకుస్తాపన చేసారు . 1979 మార్చి 5న స్వామివారి విగ్రహప్రతిష్ఠ జరిగింది. ఆలయ నిర్మాణం సర్వంగసుoదారంగా జరిగింది. చెరువు కూడా తవ్వించారు. భక్తుల వసతి కోసం సత్రం కూడా కటించారు స్వామివారిని భక్తిగా పూజించి,తమ కోర్కెలు చెప్పుకున్న భక్తులకు తప్పక సిద్ధిస్తాయి అన్న నానుడి ప్రబలిపోయింది. ఎంతోమంది సంతానంలేని దంపతులు వచ్చి స్వామివారిని దర్శించి వెళ్లి మరు సంవత్సరం చంటి పిల్లలతో మరలా వస్తుంటారని ఆలయ వేవస్తాపకులు తెలిపారు. జీవితంలో విసిగి వేసారిపోయినవారు ఇక్కడికి వచ్చి స్వమివర్ని దర్శించుకుని మరల తదుపరి సంవత్సరం సంతోషంతో వస్తారని చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ షష్టికి స్వామివారికి కళ్యాణము జరుపుతుంటారు. అనేక మంది దంపతులు వచ్చి స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొంటారు.