A Must See Temple near Vijayawada, Krishna Dist, Andhra Pradesh

Click here for కల్యాణోత్సవం 2026 – Photo Gallery

శ్రీరస్తు                                                     శుభమస్తు                          అవిగ్నమస్తూ

శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రమన్యెస్వర స్వామి వారి చరిత్ర

తనను నమ్మిన బక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ఎప్పుడు పిలిస్తే పలికే దేవుడిగా శ్రీ నాగ సుబ్రమన్యెస్వర స్వామి అని ప్రజలు చెప్పుకుంటారు కృష్ణ జిల్లా నందివాడ మండలం లోని రుద్రపాక గ్రామ శివారులో గుడివాడ పట్టణానికి ఇరువై కిలోమీటర్ల దూరంలో నాగులకోనకు ఆవల ప్రసిధ సర్పక్షేతంగా పేరుపొందిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రమన్యెస్వర స్వామి వారి దేవాలయం ఉంది . చుట్టూ రకరకాలైన వృక్షాలు,చెరువుల మద్య శబ్ద ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించిన ఈ దేవాలయం ఎంత మారుమూలలో ఉన్నప్పటికీ దేశం నలుమూలల నుండీ భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు దేవాలయానికి వచ్చి శుచిగా స్నానం చేసి మూడు సార్లు ప్రదక్షిణలు చేసి ఇతర ప్రాపంచిక విషయాలను మరచిపోయి,ఎవరైతే స్వామి వారిని పూజించి తమ మస్సులో ఉన్న కోర్కెలను,భాధలను స్వామివారికి వెల్లడించుకుంటారో వారికీ తదుపరి సంవత్సరం అదేరోజుకల్లా ఆ కోర్కెలు నెరవేరుతాయని వారి భాధలు మటుమాయం అవుతాయని ప్రతీతి . ఇందుకు అనేక ద్రుష్టoతరాలు భక్తులు చెప్పుకుంటారు ఆ క్షేత్ర మహాత్య ప్రభావమో ఏమోగాని భక్తుల పక్కనుండే ఆలయ ప్రాంగణంలో పాములు వెళ్తుంటాయి కానీ గత 30 సంవత్సరాల నుండి ఎవ్వరికి అవి హాని చేయలేదు . ఈ దేవాలయ నిర్మాణం వెనుక వక కధ ఉంది.