1999 మార్చి 21న ప్రసిధ నృసింహోపాసకులు, ఛాయా , ఆధర్వణ వేదంలో నిష్ణాతులు, శ్రీ మహాసుదర్శన్ జ్వాలా నృసింహా పీటాదిపతులు అయిన శ్రీధర్ గురూజీ ఈ క్షేత్రంలో శ్రీ సర్పనారాయణ ధన్వంతరి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. 5 అగ్నికుండాలతో చాయ అధర్వణవేదం, కృష్ణమోహన సంతాన సర్పం ప్రయోగం వంటి ఎన్నో ప్రత్యేక పద్దతులతో ఈ మహాయజ్ఞంను నిర్వహించారు. యజ్ఞకుండంలో నుంచి తీసిన అతిపెద్ద నాగమణిని గురుజీ అట్లూరి పిచ్చియ్య గారికి ఇచ్చారు. వింతకాంతులు వెదజల్లే అతి పవిత్రమైన ఆ నాగమణిని పిచ్చియ్య ఉంగరంలో పొదిగి ధరించి ఉంటారు. యజ్ఞగుండం నుండి ఐదుతలల ఆదిశేషుని పోలిన జ్వాలలు పైకి వచ్చాయి. మొత్తం 4 రోజుల యజ్ఞకలంలో 70,80 వేల మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు. 4 రోజులు అన్నదానం జరిగింది. కన్నుల పండుగగా ఆ యజ్ఞాన్ని భక్తులు దర్శించారు .